“సాయి తేజ్15” ఇంట్రెస్టింగ్ గ్లింప్స్ రిలీజ్ కి డేట్ ఫిక్స్.!

“సాయి తేజ్15” ఇంట్రెస్టింగ్ గ్లింప్స్ రిలీజ్ కి డేట్ ఫిక్స్.!

Published on Dec 4, 2022 1:00 PM IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా ఇప్పుడు పలు ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రాల్లో అయితే తన కెరీర్ లో 15వ సినిమా మంచి ప్రతిష్టాత్మకంగా మారగా ఈ చిత్రాన్ని అయితే దర్శకుడు కార్తీక్ వర్మ తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో సంయుక్త మీనన్ నటిస్తుండగా మేకర్స్ అయితే ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని ఇప్పుడు రివీల్ చేశారు.

ఈ చిత్రం నుంచి ఈ డిసెంబర్ 7న టైటిల్ గ్లింప్స్ ని అయితే రిలీజ్ చేస్తున్నట్టుగా ఓ ఆసక్తికర పోస్టర్ తో అనౌన్స్ చేశారు. మరి ఈ చిత్రం ప్రపంచంలోకి తీసుకెళతాం అన్నట్టుగా ఓ కాగడా పట్టుకొని సాయి తేజ్ చేయి ఇందులో కనిపిస్తుంది. మరి ఇదంతా చూస్తుంటే ఈ చిత్రం ఓ అడ్వెంచర్ డ్రామాలా అనిపిస్తుంది. మరి ఈ 7న అయితే మరిన్ని డీటెయిల్స్ ఈ సినిమాపై రానున్నాయని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి కాంతారా ఫేమ్ అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే బి వి ఎస్ ఎన్ ప్రసాద్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు