రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న సుధీర్ బాబు “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి”.!

Published on Aug 10, 2022 11:18 am IST


మన టాలీవుడ్ మోస్ట్ డెడికేటివ్ హీరోస్ లో నైట్రో స్టార్ సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ చిత్రాల్లో దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కిస్తున్న మరో ఇంట్రెస్టింగ్ చిత్రం “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి”. వీరి కాంబోలో వస్తున్న మరో సినిమా కావడంతో దీనిపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

మరి ఈ సినిమాలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా మేకర్స్ అయితే ఈ చిత్రంపై ఇప్పుడు అవైటెడ్ అప్డేట్ ని అందించారు. ఈ చిత్రానికి రిలీజ్ డేట్ ని రివీల్ చేస్తూ ఈ చిత్రాన్ని ఈ ఏడాది సెప్టెంబర్ 16న రిలీజ్ చేస్తున్నట్టుగా ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్ మెయిన్ లీడ్ పై డిజైన్ చేసి రివీల్ చేశారు.

మరి ఇందులో హీరోయిన్ కృతి అలాగే సుధీర్ బాబు లు మంచి లుక్స్ లో కనిపిస్తుండగా ఆమె ఓ హీరోయిన్ గా తాను డైరెక్టర్ గా ఆమె వెనక తన సినిమా యూనిట్ తో పరిగెడుతున్నట్టుగా కనిపిస్తు ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది. ఇక ఈ సినిమాకి అయితే వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ మరియు బెంచ్ మార్క్ స్టూడియోస్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :