లేటెస్ట్..సూర్య మాస్ చిత్రానికి రిలీజ్ డేట్ ఫిక్స్.!

Published on Nov 19, 2021 1:55 pm IST

కోలీవుడ్ స్టార్ నటుడు సూర్య హీరోగా నటించిన లాస్ట్ రెండు చిత్రాలు “ఆకాశం నీ హద్దురా”, “జై భీమ్” సినిమాలు నేరుగా ఓటిటి లో రిలీజ్ అయ్యి యూనానిమస్ గా హిట్ అయ్యాయి. అయితే సూర్య ఈ స్టెప్ తీసుకోవడం కాస్త బాధాకరమే అయినా ఈసారి మాత్రం థియేట్రికల్ రిలీజ్ తోనే సూర్య రెడీ అవుతున్నాడు. మళ్ళీ సాలిడ్ మాస్ బ్యాక్ డ్రాప్ లో దర్శకుడు పాండిరాజ్ తో “ఎతరక్కుమ్ తునిందవన్” అనే సినిమాని చేస్తున్నాడు.

ఈ సినిమాని అనౌన్స్ చేసిన నాటి నుంచి కూడా మంచి అంచనాలు నెలకొల్పుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాకి గాను చిత్ర యూనిట్ ఇప్పుడు రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. ఓ ఇంట్రెస్టింగ్ టీజర్ కట్ తో దీనిని అనౌన్స్ చేశారు. ఇక ఈ చిత్రంకి డి ఇమన్ సంగీతం అందిస్తుండగా సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More