అప్పుడే “దళపతి 66” ఫస్ట్ లుక్ కి డేట్ ఫిక్స్ అయ్యిందా.?

Published on May 24, 2022 10:38 pm IST

కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ హీరోగా ప్రస్తుతం మన టాలీవుడ్ స్టార్ దర్శకుడు అయినటువంటి వంశీ పైడిపల్లి తో ఇంట్రెస్టింగ్ బై లాంగువల్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ హీరోగా చేస్తున్న 66వ సినిమా ఇది. మరి దీనిపై కూడా భారీ స్థాయి అంచనాలు నెలకొనగా ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే లేటెస్ట్ గా ఈ సినిమా ఫస్ట్ లుక్ పై అప్పుడే ఇంట్రెస్టింగ్ బజ్ బయటకి వచ్చేసింది.

మరి దీని ప్రకారం అయితే ఈ జూన్ 21నే ఈ సినిమా ఫస్ట్ లుక్ మేకర్స్ రిలీజ్ చేస్తున్నారట. ఆరోజు విజయ్ బర్త్ డే కానుకగా ఈ ఫస్ట్ లుక్ ని లాంచ్ చేస్తారట. మరి దీనిపై అయితే అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా అనేక మంది ప్రముఖ తారలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :