లేటెస్ట్..ట్రిపుల్ నవ్వుల డోస్ “ఎఫ్3” కి రిలీజ్ డేట్ ఫిక్స్.!

Published on Oct 24, 2021 12:00 pm IST

టాలీవుడ్ అతి తక్కవ మంది సక్సెస్ ఫుల్ దర్శకుల్లో ఒకరైన అనీల్ రావిపూడి తెరకెక్కించిన హిట్ చిత్రాల్లో విక్టరీ వెంకటేష్ మరియు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లు హీరోలుగా తమన్నా మరియు మెహ్రీన్ లు హీరోయిన్స్ గా నటించిన చిత్రం “ఎఫ్ 2” కూడా ఒకటి. సంక్రాంతి రేస్ లో వచ్చి భారీ హిట్ గా ఈ చిత్రం నిలిచింది.

ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టడంతో యూనానిమస్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం నిలిచింది. దీనితో ఈ ఫ్రాంచైజ్ లో మరో సినిమా “ఎఫ్ 3” ని అనౌన్స్ చేయడంతోనే భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి సినిమాని మించి ఎక్కువ ఫన్ తో తెరకెక్కుతున్న ఈ ఈ నవ్వుల ట్రిపుల్ డోస్ “ఎఫ్ 3” రిలీజ్ డేట్ ని ఇప్పుడు మేకర్స్ అనౌన్స్ చేసేసారు.

మొదట సినిమా సంక్రాంతి బరిలోనే ఉంటుంది అని అనుకున్నారు కానీ ఇప్పుడు ఈ సినిమాని వచ్చే ఏడాది ఫిబ్రవరి 25కి ఫిక్స్ చేసేసారు. సో ఈ నవ్వుల నజరానా కోసం అపుడు వరకు ఎదురు చూడాల్సిందే. మరి ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ నే సంగీతం అందిస్తుండగా దిల్ రాజు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :

More