మెగా హీరో సినిమా రిలీజ్ డేట్ అదేనా ?


‘ముకుంద’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన యంగ్ మెగా హీరో వరుణ్ తేజ్ ‘కంచె’ సినిమాతో మంచి సక్సెస్ అందుకుని అందరి దృష్టినీ ఆకర్షించాడు. కానీ పూరి డైరెక్షన్లో చేసిన ‘లోఫర్’ ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో కాస్త వెనుకబడ్డ వరుణ్ తేజ్ 2016 లో రెండు సినిమాల్ని మొదలుపెట్టాడు. ఆ రెండింటిలో శ్రీను వైట్ల డైరెక్ట్ చేస్తున్న ‘మిస్టర్’ చిత్రం ముగింపు దశకు చేరుకుందట. రెండు పాటలు మినహా మిగతా షూట్ అంతా పూర్తయిందని తెలుస్తోంది.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 14న గుడ్ ఫ్రైడే సందర్బంగా విడుదల చేస్తారని అంటున్నారు. అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ నుండి ఇంకా ఎలాంటి స్పందనా రాలేదు. స్పెయిన్, స్వీటీజర్ ల్యాండ్, చిక్ మంగుళూరు, ఊటీ వంటి పలు అందమైన లొకేషన్లలో చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రాల్లో లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్ లు కథానాయికలుగా నటిస్తున్నారు.