ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ “800” రిలీజ్ డేట్ ఖరారు.!

Published on Sep 14, 2023 12:00 pm IST

శ్రీలంకన్ క్రికెట్ జట్టు లెజెండరీ ఆటగాడు ముత్తయ్య మురళీ ధరన్ జీవిత చరిత్రపై ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి మొదటి మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో స్టార్ట్ అయ్యిన ఈ చిత్రం నెక్స్ట్ నటుడు మధుర్ మిట్టల్ తో మేకర్స్ చేసారు. అయితే రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ కట్ కి అయితే అందరి నుంచి మంచి రెస్పాన్స్ కూడా రాగా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూసారు. మరి ఈ సినిమా రిలీజ్ డేట్ ని అయితే మేకర్స్ ఇప్పుడు అనౌన్స్ చేశారు.

ఈ సినిమాని ఈ అక్టోబర్ 6న గ్రాండ్ గా తెలుగు తమిళ సహా హిందీ భాషల్లో అయితే రిలీజ్ చేస్తున్నట్టుగా ఇపుడు కన్ఫర్మ్ అయ్యింది. మరి ఈ చిత్రానికి ఎం ఎస్ శ్రీపతి దర్శకత్వం వహించగా జిబ్రాన్ సంగీతం అందించాడు. అలాగే ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ మరియు మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహించారు. మరి క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ బయోపిక్ మిగతా వాటి రేంజ్ సక్సెస్ అందుకుంటుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :