విడుదలకు సిద్దమైన నిఖిల్ మూవీ !

కన్నడలో విజయవంతమైన కిరిక్ పార్టి సినిమాను తెలుగులో కిరాక్ పార్టి పేరుతో రీమేక్ చేసున్నాడు నిఖిల్. సినిమాల సెలక్షన్ విషయంలో ఎంతో కేర్ ఫుల్ గా ఉండే ఈ హీరో కిరాక్ పార్టి ని కూడా తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మలుచుతున్నట్లు తెలుస్తోంది ఈమూవిని సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. కొత్త దర్శకుడు శరన్ కొప్పిశెట్టి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 9 న ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు. కాలేజ్ క్యాంపస్ లో జరిగే రాజకీయాలు ఎలా ఉండబోతున్నయనే విషయాలు ఈ సినిమాలో చుపించబోతున్నారు. సంయుక్తా హెగ్డే మరియు సిమ్రాన్ పరీన్జా క‌థానాయిక‌లుగా నటిస్తోన్న ఈ సినిమాకు అజ‌నీష్ లొక‌నాథ్ సంగీతం అందిస్తున్నారు.