రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘కథలో రాజకుమారి’ !


గతేడాది వరుస సినిమాలతో సందడి చేసిన హీరో నారా రోహిత్ ఈ సంవత్సరం బాక్సాఫీస్ వద్ద తన ఖాతాను ఇంకా ఓపెన్ చేయలేదు. ఆయన నటించిన తాజా చిత్రం ‘కథలో రాజకుమారి’ తో 2017 ను ఆరంబించనున్నాడు ఈ నారా హీరో. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉనన్ ఈ సినిమాను జూన్ 30న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్స్ కి కూడా మంచి స్పందన రావడంతో సినిమాపై పాజిటివ్ క్రేజ్ నెలకొంది.

ఆరన్ మీడియా వర్క్స్ పతాకంపై కృష్ణ విజయ్, ప్రశాంతి, సౌందర్యలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మరొక యంగ్ హీరో నాగ శౌర్య ఒక ప్రధాన పాత్రలో కనియించబోతున్నాడు. ఇకపోతే మహేష్ సూరపనేని డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో నమిత ప్రమోద్ హీరోయిన్ గా నటిస్తోంది. దీంతో పాటెరోహిత్ ‘పండగల దిగివచ్చాడు, శమంతకమణి, వీరభోగ వసంత రాయలు’ వంటి చిత్రాల్లో నటిస్తున్నాడు.