రంగస్థలం విడుదల తేది ఖరారు !

9th, December 2017 - 10:18:12 AM

రామ్ చరణ్ , సుకుమార్ కాంబినేషన్ లో వస్తోన్న రంగస్థలం సినిమా ఫస్ట్ లుక్ ఈరోజు ఉదయం విడుదల అయ్యింది. మాస్ లుక్ లో చరణ్ అభిమానుల్ని మెప్పించాడు. సమంత హీరొయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల అవ్వాల్సి ఉంది కాని కొన్ని అనివార్య కారణాల వల్ల మర్చి 30 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

పల్లెటూరు వతావరణలో జరిగే ప్రేమకథగా ఈ సినిమాను తెరకేక్కిస్తున్నాడు సుకుమార్. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంభందించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఆది పినిశెట్టి ఈ సినిమాలో చరణ్ కు సోదరుడిగా నటించిన సంగతి తెలిసిందే.