ఉదయం 9 గంటలకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్న మహేష్ !


సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘స్పైడర్’ చిత్ర టీజర్ రేపు రిలీజ్ కానుంది. ఉదయం 9 గంటలకు యూట్యూబ్ ద్వారా ఈ టీజర్ ను విడుదలచేయనున్నారు. రేపు మహేష్ బాబు పుట్టినరోజు సందర్బంగా ఈ టీజర్ ను విడుదలచేస్తున్నారు. ఇలా పుట్టినరోజునాడే టీజర్ కు వదులుతుండటంతో అభిమానుల్లో ఉత్సాహం, ఆనందం రెట్టింపయ్యాయి.

ఠాగూర్ మధు, ఎన్వి ప్రసాద్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం స్పై థ్రిల్లర్ గా ఉండనుంది. దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను తెలుగుతో సమానంగా తమిళంలో కూడా సెప్టెంబర్ 27న భారీ ఎత్తున రిలీజ్ చేస్తుండటంతో మహేష్ మార్కెట్ పరిధి మరింతగా పెరగనుంది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి హారీశ్ జైరాజ్ సంగీతం అందించారు.