ఫిబ్రవరిలో రానున్న ‘గుర్తుందా శీతాకాలం’ !

Published on Dec 13, 2021 11:40 am IST

టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నాగ శేఖర్ తెరకెక్కిస్తున్న సినిమా ‘గుర్తుందా శీతాకాలం’. కాగా తాజాగా ఈ సినిమా రిలీజ్ విషయంలో మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఫిబ్రవరిలో ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది అని చిత్రబృందం నుంచి అధికారికంగా ఒక పోస్టర్ ను రిలీజ్ చేసింది.

ప్ర‌తీ ఒక్క‌రు త‌మ జీవితంలో సెటిల్ అయిన తర్వాత కొన్ని విష‌యాల్ని ఎప్ప‌టికీ మ‌రిచిపోరు. ముఖ్యంగా టీనేజ్, కాలేజ్ ఆ తర్వాత వ‌చ్చే యూత్ లైఫ్‌లో జ‌రిగే సంఘ‌ట‌న‌లు జీవితాంతం గుర్తుకు వ‌స్తూనే ఉంటాయి. ఇలాంటి ఆహ్లాద‌క‌ర‌మైన సంఘ‌ట‌ణ‌లు ప్రేక్ష‌కుల‌కి గుర్తు చేసే ఉద్దేశంతో నాగ‌శేఖ‌ర్ మూవీస్ బ్యాన‌ర్ మీద నాగ‌శేఖ‌ర్ – భావ‌న‌ర‌వి, ఎమ్ ఎస్ రెడ్డి, చిన‌బాబు గారు సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా గుర్తుందా శీతాకాలం.

స‌త్యదేవ్, త‌మ‌న్నాలతో పాటు మేఘా ఆకాష్, కావ్య‌శెట్టి తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. దాంతో ఈ సినిమాపై ఆసక్తి కూడా బాగానే పెరిగిపోయింది. క‌న్న‌డ‌లో విడుద‌లై సూప‌ర్ హిట్ అయిన ల‌వ్ మాక్ టేల్ ఆధారంగా గుర్తుందా శీతాకాలం చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

సంబంధిత సమాచారం :