నేను పవన్ గురించి మాట్లాడితే వేరే హీరోల ఫ్యాన్స్ క్రిటిసైజ్ చేస్తున్నారు – రేణు దేశాయ్

renu_desai
సోషల్ మీడియాలో తనపై వస్తున్న కామెంట్లకు, ట్రోలింగ్ కు సమాధానంగా రేణు దేశాయ్ తన ఇంటర్వ్యూ వీడియోని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇందులో ఆమె మాట్లాడుతూ ‘మీ అందరూ పవన్ గారి ఫోటోలు పెట్టుకోవచ్చు. ఆయన గురించి మాట్లాడొచ్చు. కానీ నేను మాత్రం ఆయన టాపిక్ మాట్లాడకూడదు. ఆయన ఫోటో పెడితే ఇప్పుడు ఆమెకు పవన్ గగురించి మాట్లాడటం అవసరమా. పబ్లిసిటీ కోసమే ఇదంతా చేస్తోంది అంటున్నారు. అసలు నేనేందుకు ఆయన గురించి మాట్లాడకూడదు. డైవర్స్ పేపర్ మీద ఒక సంతకం పెట్టగానే మా మధ్య రిలేషన్ పోయినట్టేనా’ అంటూ తన అభిప్రాయాన్ని తెలిపారు.

అలాగే ‘నేను పవన్ గురించి మాట్లాడితే వేరే హీరోల ఫ్యాన్స్ క్రిటిసైజ్ చేస్తున్నారు. కొంతమంది అబ్బాయిలు, వ్యక్తులు తమ డైలీ లైఫ్ లో ఉండే ఫ్రస్ట్రేషన్ నా మీద చూపిస్తుంటారు. పవన్ నేను మంచి స్నేహితులం. మాది 17 ఏళ్ల బంధం. మా మధ్య ఇద్దరు పిల్లలున్నారు. ఆయన రాజకీయ జీవితం మీకిప్పుడు తెలుసు. కానీ 1999 నుండి నాకు తెలుసు. ఆయన్ను ఎమన్నా అనాల్సొస్తే మా అందరినీ తిడతారు. అది మంచి పద్దతి కాదు’ అంటూ తనకు, పవన్ కి మధ్య ఉన్న స్నేహాన్ని గుర్తు చేశారు.