తెలుగు డాన్స్ షో కి హోస్ట్ గా రేణు దేశాయ్


పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ప్రస్తుతం తన పిల్లల తో పూణేలో ఉంటున్నారు. పవన్ నుంచి విడిపోయాక కూడా ఆమె సినిమాల పై ఉన్న ఫ్యాషన్ ని మాత్రం వదులుకోలేదు. ఆ మధ్యన రేణు దేశాయ్ ఓ చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు. కాగా బుల్లి తెరపై రేణు దేశాయ్ ఎంట్రీ ఖాయం అయింది. ప్రస్తుతం సినీ తారలంతా బుల్లి తెరపై హోస్ట్ లుగా మారుతున్న విషయం తెలిసిందే. రేణు కూడా ఓ రియాలిటీ షోకి హోస్ట్ గా వ్యవహరించనున్నారు.

ప్రముఖ తెలుగు ఛానల్ ‘స్టార్ మా’ లో ప్రస్తుతం ఎన్టీఆర్ హోస్ట్ గా బిగ్ బాస్ షో సాగుతోంది. ఈ సీజన్ పూర్తయ్యాక ‘స్టార్ మా’ మరో షోకి ప్లాన్ చేసింది. బిగ్ రియాలిటీ డాన్స్ షో పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ షోకి రేణు దేశాయ్ హోస్ట్ గా వ్యవహరించనున్నారు. రేణు హోస్ట్ గా వ్యవహరించనున్న ఈ డాన్స్ షో పై అంతా ఆసక్తిగా ఉన్నారు.