పవన్ కళ్యాణ్ పేరు వాడుకోవడం లేదు – రేణు దేశాయ్.

Pawan-kalyan-Renu-Desai
పవన్ కళ్యాణ్ పేరు ఉపయోగిస్తూ మంచి పబ్లిసిటీ కొట్టేస్తుంది అని విమర్శలు చేస్తున్న వారిపై రేణు దేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ద్వారా తనపై విమర్శలు చేస్తున్నవారికి సమాధానం చెప్పారు. రేణు దేశాయ్ దర్శకనిర్మాతగా తెరకెక్కించిన ‘ఇష్క్ వాలా లవ్’ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ఏదో ఒక రకంగా పవన్ కు ముడి పెడుతున్నారు. పవన్, రేణుల కుమారుడు అకిరా నందన్ తో అతిధి పాత్ర చేయించడం, పవన్ బర్త్ డే నాడు టీజర్ రిలీజ్ చేయడం పవన్ పేరును ఉపయోగించడమే అనేది విమర్శకుల వాదన. వీటికి ఘాటుగా బదులిచ్చారు రేణు దేశాయ్.

పవన్ కళ్యాణ్ ను వివాహం చేసుకునే సమయానికి హీరోయిన్ గా, మోడల్ గా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాను. ఎవరి సపోర్ట్ లేకుండానే గత ఏడాది ఒక సినిమా నిర్మించి హిట్ కొట్టాను. అప్పుడు పవన్ నన్ను ప్రశంసించారు కూడా. పవన్ కళ్యాణ్ పేరు ఉపయోగిస్తున్నాను అంటూ అతిగా ఆలోచించే ప్రజలకు ఒక విన్నపం… మీ బ్రెయిన్ కు కొంచం రెస్ట్ ఇచ్చి.. ఆ ఎనర్జీను సోషల్ వర్క్స్ చేయడానికి ఉపయోగించండి అని సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు.

Exit mobile version