“టైగర్ నాగేశ్వరరావు” నుంచి రేణు దేశాయ్ లుక్ రిలీజ్.!

Published on Oct 1, 2023 11:37 am IST

మాస్ మహారాజ రవితేజ హీరోగా దర్శకుడు వంశీ తెరకెక్కిస్తున్న భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా “టైగర్ నాగేశ్వరరావు” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం కోసం అంతా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తుండగా ఈ సినిమా మేకర్స్ అయితే గత కొన్ని రోజులు నుంచి సినిమాలో కనిపించనున్న కొందరి ముఖ్య నటీ నటుల ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని అయితే లాంచ్ చేస్తున్నారు. మరి ఈ లాంచ్ లో భాగంగా నటి రేణు దేశాయ్ లుక్ ని అయితే రిలీజ్ చేశారు.

మరి ఈ చిత్రంలో రేణు హేమలత లవణం అనే పాత్రలో కనిపించనున్నారు అని ఆమెపై ఓ ప్లెజెంట్ పోస్టర్ ని అయితే రిలీజ్ చేశారు. మరి ఇందులో రేణు దేశాయ్ చాలా సింపుల్ గా నవ్వుతు కనిపిస్తున్నారు. మరి సినిమాలో తనది ఎలాంటి పాత్ర అనేది చూడాలి. ఇక ఈ చిత్రం నుంచి అవైటెడ్ ట్రైలర్ ని మేకర్స్ ఈ అక్టోబర్ 3న రిలీజ్ చేస్తుండగా సినిమా అయితే ఈ అక్టోబర్ 20న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం :