పవన్ కళ్యాణ్ కళ్ళలోని ఆ తీవ్రత నాకిష్టం : రేణు దేశాయ్

29th, August 2016 - 03:59:54 PM

pawan
పవన్ కళ్యాణ్ రెండవ భార్య, ఒకప్పటి హీరోయిన్ రేణు దేశాయ్ అప్పుడప్పుడూ తన ట్విట్టర్ అకౌంట్లో పవన్ గురించి ప్రత్యక్షంగా, అప్పుడప్పుడు పరోక్షంగా ఆసక్తికరమైన ట్వీట్లు చేస్తుంటుంది. ఇప్పుడు కూడా అలాంటి ట్వీట్ ఒకటి చేసింది. ఎప్పుడో తాను తీసిన పవన్ ఫోటో ఒకదాన్నీ పోస్ట్ చేసి ‘ ఇది నాకిష్టమైన ఫోటో. ఆయనకళ్ళలోని ఆ తీవ్రత నాకిష్టం. ఈ ఫోటోలో ఆయన స్కిన్ టోన్ కూడా ఒరిజినల్. నేను ఎడిట్ చేసింది కాదు’ అన్నారు.

2010 లో ఒకరోజు పవన్ ఒంటరిగా, నిశ్శబ్దంగా కూర్చుని ఆలోచిస్తుంటే ఈ ఫోటో తీశాను. కావాలంటే ఈ ఫోటోని పవన్ పుట్టినరోజు సందర్బంగా అందరూ కామన్ డీపీ గా కూడా వాడుకోవచ్చని తెలిపింది. అది చూసిన పవన్ కళ్యాణ్ అభిమానులు ఫోటోను అందరికీ షేర్ చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ప్రస్తుతం పవన్, డాలి దర్శకత్వంలో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఓ లవ్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నారు.