అఖీరా బర్త్ డే కి అద్దిరిపోయే వీడియో ను షేర్ చేసిన రేణు దేశాయ్!

Published on Apr 8, 2022 7:01 pm IST

టాలీవుడ్ స్టార్ హీరో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అఖీరా నందన్ పుట్టిన రోజు సందర్భంగా రేణు దేశాయ్ ఒక వీడియో ను సోషల్ మీడియా వేదిక గా షేర్ చేయడం జరిగింది. ఈ వీడియో లో అఖిరా బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపిస్తున్నారు. ఈ వీడియో లో అఖిరా తన ప్రాక్టీస్ తో అదరగొడుతున్నాడు. ఈ వీడియో ను షేర్ చేస్తూ రేణు దేశాయ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

తను యాక్టర్ అవ్వాలని అనుకోవడం లేదు అని, సింగర్ కూడా కావాలని అనుకోవడం లేదు అని స్పష్టం చేశారు. అంతేకాక తన డెబ్యూ పై ఎలాంటి పుకార్లు నమ్మొద్దు అంటూ చెప్పుకొచ్చారు. రేణు దేశాయ్ షేర్ చేసిన వీడియో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం :