కళ్యాణ్ ప్రమాణ స్వీకారంకి అకిరా, ఆద్య.. పవన్ కి రేణు దేశాయ్ స్పెషల్ విషెస్

కళ్యాణ్ ప్రమాణ స్వీకారంకి అకిరా, ఆద్య.. పవన్ కి రేణు దేశాయ్ స్పెషల్ విషెస్

Published on Jun 12, 2024 11:03 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక్క సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా నిజమైన పవర్ అందుకొని తన సేవా కార్యక్రమాలు మరింత చేసే పథంలో దూసుకెళ్తున్నారు. అలా తను రీసెంట్ గా ఏపీలో అఖండ విజయాన్ని సొంతం చేసుకోగా నేడు తన ప్రమాణ స్వీకారం జరగబోతుంది.

అయితే ఈ కార్యక్రమంకి మెగా ఫ్యాన్స్ తరలి వెళ్తుండగా పవన్ వారసులు అకిరా అలాగే ఆద్యాలు కూడా వెళ్లబోతున్నారు. మరి ఈ హ్యాపీ మూమెంట్ లో పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ బ్యూటిఫుల్ పోస్ట్ చేసారు. తన పిల్లలు ఇద్దరితో వీడియో కాల్ మాట్లాడినట్టుగా వారిద్దరూ ప్రమాణ స్వీకారం కార్యక్రమంకి రెడీ అయ్యారు అయ్యారు అంటూ పోస్ట్ చేసారు.

అంతే కాకుండా కళ్యాణ్ గారికి తన బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను అని ఏపీకి ఇంకా సమాజానికి మీరు ఎంతో చేయాలని తెలిపారు. దీనితో ఈ పోస్ట్ ఇప్పుడు అభిమానుల్లో మరింత అనందాన్ని నింపింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు