మురుగదాస్ హాలీవుడ్ సినిమా ఒట్టి పుకారేనట !
Published on Dec 5, 2017 1:03 pm IST

స్టార్ డైరెక్టర్ మురుగదాస్ మహేష్ బాబుతో తీసిన ‘స్పైడర్’ సినిమా తరువాత తమిళ్ లో విజయ్ తో ఒక సినిమా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి మద్య కథా చర్చలు కూడా పూర్తయ్యాయి. త్వరలో ఈ ప్రాజెక్ట్ ప్రారంబంకానుంది. ఈ మద్య మురుగదాస్ హాలీవుడ్ ‘మిలియన్ డాలర్ బేబీ’ సినిమాను అక్షయ్ కుమార్ తో రీమేక్ చెయ్యబోతునట్లు వార్తలొచ్చాయి.

అయితే మురుగదాస్ హాలీవుడ్ సినిమాను రీమేక్ చెయ్యడం లేదని, ఇది కేవలం పుకారేనని తెలుస్తోంది. ఈ వార్తల్లో వాస్తవం లేదని మురుగదాస్ సన్నిహితులు చెబుతున్నారు. విజయ్ సినిమా కోసం స్క్రిప్ట్ వర్క్ బిజీలో ఉన్న ఈ డైరెక్టర్ త్వరలో మూవీని ప్రారంభించబోతున్నాడు.

 
Like us on Facebook