డిజిటల్ ప్రీమియర్ కి సిద్ధమైన సాయి ధరమ్ తేజ్ “రిపబ్లిక్”

Published on Nov 2, 2021 7:05 am IST

సాయి ధరమ్ తేజ్ హీరోగా దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్ యాక్షన్ డ్రామా రిపబ్లిక్. ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతోంది. ఈ చిత్రం జీ 5 లో నవంబర్ 26 వ తేదీ నుండి స్ట్రీమ్ కానున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రం అక్టోబర్ 1 వ తేదీన థియేటర్ల లో విడుదల అయిన సంగతి తెలిసిందే. థియేటర్ల లో విడుదల అయిన రెండు నెలల కి ఓటిటి ద్వారా ప్రేక్షకులకు, అభిమానులకు అందుబాటులో కి రానుంది. అయితే త్వరలో ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన జీ 5 వెల్లడించే అవకాశం ఉంది. జే బీ ఎంటర్ టైన్మెంట్స్ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం లో ఐశ్వర్య రాజేష్, జగపతి బాబు, రమ్య కృష్ణ లు కీలక పాత్రల్లో నటించారు. మణి శర్మ ఈ చిత్రానికి సంగీతం అందించడం జరిగింది.

సంబంధిత సమాచారం :

More