వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా రిపబ్లిక్

Published on Jan 14, 2022 11:13 pm IST

సాయి ధరమ్ తేజ్ హీరోగా దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్ డ్రామా రిపబ్లిక్. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రం ఓటిటి లోకి వచ్చిన అనంతరం నుండి సినిమా కి మరింత పాజిటివ్ రెస్పాన్స్ రావడం విశేషం. రమ్య కృష్ణ, ఐశ్వర్య రాజేష్, జగపతి బాబు లు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి సిద్దం అవుతుంది.

ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. జనవరి 23 వ తేదీన సాయంత్రం 6 గంటలకు జీ తెలుగు లో ప్రసారం కానుంది. పొలిటికల్ గా మాత్రమే కాకుండా, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వచ్చిన ఈ రిపబ్లిక్ చిత్రం బుల్లితెర పై ఏ విధమైన రెస్పాన్స్ అందుకుంటుందొ చూడాలి.

సంబంధిత సమాచారం :