ఈ ఆదివారం “రిపబ్లిక్” సినిమా టెలివిజన్ ద్వారా మిమ్మల్ని పలకరించబోతోంది – దర్శకుడు దేవ కట్టా

Published on Jan 18, 2022 3:32 pm IST

మ‌న ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌లో రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌, ఎగ్జిక్యూటివ్స్‌, న్యాయ‌వ్యవస్థ మూడు గుర్రాలు. ఈ మూడు స‌క్ర‌మంగా ఉన్న‌ప్పుడే ప్ర‌జ‌ల‌కు న్యాయం జ‌రుగుతుంది. కానీ రాజ‌కీయ వ్య‌వ‌స్థ తానే బ‌ల‌వంత‌మైన వ్య‌వ‌స్థ అనుకుని మిగిలిన రెండు వ్య‌వ‌స్థ‌ల‌ను కంట్రోల్ చేస్తే ఏవిధంగా వ్య‌వ‌స్థ చిన్నాభిన్నమవుతుందని చెప్పే ప్ర‌య‌త్నం చేసారు ద‌ర్శ‌కుడు దేవ క‌ట్టా రిపబ్లిక్ సినిమాలో. అటు తారలు, మరియు అభిమానుల మన్ననలను పొందిన ఈ సినిమా థియేటర్ లో, ఓటిటి లో అందరిని ఎంతో ఆకట్టుకుంది. అలాంటి సినిమాను ఎప్పుడూ ప్రేక్షకులకి వినోదాన్ని అందించడానికి సిద్ధంగా ఉండే జీ తెలుగు ఈ ఆదివారం, జనవరి 23 సాయంత్రం 6 గంటలకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం చేయనుంది.

ఈ సందర్భంగా దర్శకుడు దేవ కట్టా మాట్లాడుతూ, “ఈ ఆదివారం, జనవరి 23న సాయంత్రం ఆరు గంటలకి, ‘రిపబ్లిక్’ సినిమా టెలివిషన్ ద్వారా మిమ్మల్ని పలకరించబోతోంది. ఈ సినిమాని ప్రేక్షకులందరూ ప్రబలంగా ఆదరిస్తారని ఆశిస్తున్నాం. వ్యవస్థ మీద మనందిరి మనుసులో ఉన్న మనోభావలని ప్రతిబింబిస్తూ, నిజాన్ని నిర్భయంగా ఎలుగెత్తిన సినిమాగా రిపబ్లిక్ ఇప్పటికే ఎంతో మందిని ఒక ఉద్యమంలా ప్రభావితం చేసింది. నిజం ఎప్పుడూ దిస్టర్బ్ చేస్తుంది, ఆ క్షణంలో స్తంబింప చేస్తుంది, చివరికి మన ఆలోచనలో భాగమై, బలమై ముందుకు నడిపిస్తుంది. ఆ బలమే ఈ రిపబ్లిక్” అని అన్నారు.

1970 లో స్వచ్ఛమైన తెల్లేరు సరస్సును రాజకీయ ప్రాబల్యం ఉన్న వ్యక్తులు కబ్జా చేస్తారు. అప్పటి నుంచి ఆ సరస్సులో విషపు ఆహారాన్ని వేస్తూ చేపలను పెంచుతారు. దాని కారణంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అనారోగ్యానికి గురవుతారు. అయినప్పటికీ ఆంధ్ర ప్రజా పార్టీ అధినేత్రి విశాఖవాణి తన వ్యాపారాన్ని వదులుకోదు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని రాజకీయంగా ఎదుగుతూ తన కొడుకుని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోపెడుతుంది. ఆ ప్రాంతానికి కలెక్టర్‌గా వచ్చిన అభిరామ్‌ తెల్లేరు సరస్సు ఆక్రమించినవారిపై చర్యలు తీసుకుంటాడు. ఈ క్రమంలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న విశాఖవాణితో వైరం పెరుగుతోంది. ఇది ఎంతవరకు దారి తీసింది? తదనంతర పరిణామాలు ఏమిటీ? అనేది తెలుసుకోవాలంటే ప్రీమియర్ జీ తెలుగు లో చూడాల్సిందే.

ప్ర‌జ‌ల కోసం, జ‌రుగుతున్న అన్యాయాల‌ను బ‌య‌ట‌పెట్ట‌డానికి ప్ర‌య‌త్నించిన ఐఏఎస్ ఆఫీస‌ర్స్‌ను కొంద‌రు హ‌త‌మార్చారు. అలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకుని దేవ‌క‌ట్టా ఈ క‌థ‌ను రాసుకున్నారు. ఎప్ప‌టిలాగానే మ‌ణిశ‌ర్మ త‌న‌దైన పంథాలో మంచి నేప‌థ్య సంగీతాన్ని అందిచంగా, సుకుమార్ సినిమాటోగ్ర‌ఫీ అందరిని మంత్రముగ్ధుల్ని చేస్తుంది.

సంబంధిత సమాచారం :