వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా సాయి ధరమ్ తేజ్ “రిపబ్లిక్”…త్వరలో

Published on Jan 10, 2022 1:00 pm IST

సాయి ధరమ్ తేజ్ హీరోగా దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రిపబ్లిక్. జేబి ఎంటర్ టైన్మెంట్స్ మరియు జీ స్టూడియోస్ పతాకంపై ఈ చిత్రాన్ని జే.భగవాన్ మరియు జే. పుల్లారావు లు సంయుక్తంగా నిర్మించడం జరిగింది. ఐశ్వర్య రాజేష్, జగపతి బాబు, రమ్య కృష్ణ లు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం పొలిటికల్ డ్రామా గా సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది.

ఈ చిత్రం ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయ్యింది. త్వరలో రిపబ్లిక్ చిత్రం జీ తెలుగు టీవి లో ప్రసారం కానుంది. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. బుల్లితెర పై ఎలాంటి రెస్పాన్స్ వస్తుందొ చూడాలి.

సంబంధిత సమాచారం :