మరొక ఫైల్ ను విడుదల చేసిన “రిపబ్లిక్” టీమ్!

Published on Sep 17, 2021 10:00 pm IST


సాయి ధరమ్ తేజ్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా దేవ కట్టా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రిపబ్లిక్. ఈ చిత్రం ను అక్టోబర్ 1 వ తేదీన థియేటర్ల లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ మేరకు దేశం లో నిజాయితీ గా పని చేసిన కొందరు వ్యక్తుల గురించి రిపబ్లిక్ టీమ్ వీడియో లను రూపొందించి విడుదల చేయడం జరుగుతుంది.

ఇప్పటికే కర్ణాటక రాష్ట్రానికి చెందిన డి కే రవి గురించి ఒక విడియో ను చేసిన రిపబ్లిక్ టీమ్, ఇప్పుడు తమిళనాడు ప్రాంతానికి చెందిన యూ సగాయం వీడియో ను చేసి, రెండవ ఫైల్ అంటూ విడుదల చేయడం జరిగింది. అయితే ఈ తరహా వీడియో లు ఇంకా విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సొసైటీ పై, ఇందులో ఉన్న సమస్యల పై ఒక అంశం గా తీసుకొని రిపబ్లిక్ చిత్రం ఉండే అవకాశం వుంది. రిపబ్లిక్ చిత్రానికి సంగీతం మణిశర్మ అందిస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :