‘లెనిన్’లో ఆ సీక్వెన్స్ రీషూట్ ?

Lenin

యువ హీరో అక్కినేని అఖిల్ ప్రస్తుతం తన ‘లెనిన్’ చిత్రాన్ని దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి (నందు) డైరెక్షన్‌ లో చేస్తున్నాడు. ఐతే, అఖిల్ – భాగ్య శ్రీ బోర్సే లపై తీసిన ఓ సీక్వెన్స్ విషయంలో ఇప్పుడు ఓ అప్ డేట్ వినిపిస్తోంది. నిజానికి ఈ సీక్వెన్స్ షూటింగ్ పూర్తి అయినా.. అవుట్ ఫుట్ విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకూడదనే ఉద్దేశ్యంతో ఈ సీక్వెన్స్ ను భారీ స్థాయిలో మళ్ళీ రీషూట్ చేయాలని టీం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో అఖిల్ పాత్రకి దృష్టి లోపం ఉంటుందని.. ఆ కారణంగా ఆ పాత్ర పడే ఇబ్బందులు.. హీరో పాత్ర చుట్టూ నడిచే డ్రామా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుందని.. ముఖ్యంగా ఈ పాయింట్ కి ఇంటర్వెల్ సీక్వెన్స్ ను చాలా బాగా కనెక్ట్ చేశారని తెలుస్తోంది. కాగా ఈ సినిమా.. రాయలసీమ బ్యాక్‌ డ్రాప్‌ తో చిత్తూరు ప్రాంతం నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాలో అందాల భామ భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. ఇక సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమాతో అఖిల్ హిట్ కొడతాడో లేదో చూడాలి.

Exit mobile version