అన్ని విధాల మెప్పించిన ‘రాజుగారి గది -2’ ట్రైలర్ !
Published on Sep 20, 2017 11:52 am IST


నాగార్జున ప్రధాన పాత్రలో ఓంకార్ రూపొందించిన హర్రర్ థ్రిల్లర్ ‘రాజుగారి గది-2’ ట్రైలర్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ ట్రైలర్ అన్ని విధాలా ఆకట్టుకుంది. మంచి థ్రిల్స్ తో పాటు హర్రర్ కంటెంట్ కూడా గట్టిగానే ఉండటంతో సినిమాపై ఆసక్తి ఇంకాస్త పెరిగింది. సినిమా మొత్తం ఆత్మల మీదే ఉండటం, ఆ ఆత్మ పాత్రను సమంత చేయడం, ఆమె వెనుక ఏదో బలమైన కథే ఉందని చెప్పడంతో ఆమె పాత్ర, కథ ఎలా ఉంటుందో చూడాలని కుతూహలం మొదలైంది.

ఇక వెన్నెల కిశోర్, షకలక శంకర్, ప్రవీణ్ వంటి స్టార్ కమెడియన్ల పెర్ఫార్మెన్స్ కూడా ఆకట్టుకుంది. అలాగే సినిమాలో అతి ముఖ్యమైన హర్రర్ సినిమాకు అతి ముఖ్యమైన థ్రిల్లింగ్ సన్నివేశాలు కూడా ఎక్కువ మోతాదులోనే ఉండేలా కనిపిస్తున్నాయి. వీటికి తోడు థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ, ఓంకార్ మేకింగ్ కూడా మంచి క్వాలిటీతో ఉండి ట్రైలర్ ను బలంగా నిలబెట్టాయి. శీరత్ కపూర్ కూడా ఒక కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం అక్టోబర్ 13న రిలీజ్ కానుంది.

ట్రైలర్ కోసం క్లిక్ చేయండి:

 
Like us on Facebook