ఏపి, తెలంగాణల్లో ‘రాజుగారి గది -2’ వసూళ్ల వివరాలు !
Published on Oct 15, 2017 11:40 am IST

మంచి అంచనాలను నడుమా గత శుక్రవారం విడుదలైన ‘రాజుగారి గది -2’ చిత్రం బాక్సాఫీస్ వద్ద మెల్లగా పుంజుకుంటోంది. మొదటిరోజు ఏపి, తెలంగాణల్లో కలిపి రూ.3.9 కోట్ల షేర్ ఓపినింగ్స్ ను వసూలు చేసిన ఈ చిత్రం రెండవ రోజు కూడా అదే తరహా పెర్ఫార్మెన్స్ చూపించింది. దీంతో అన్ని ఏరియాల్లో కలెక్షన్స్ మెరుగ్గా కొనసాగుతున్నాయి.

ఇక ఏరియాలవారీగా కలెక్షన్స్ చూస్తే నైజాంలో రూ.2.71 కోట్లు, సీడెడ్లో రూ.91 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ.77 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ.56 లక్షలు, వెస్ట్ గోదావరి రూ. 41 లక్షలు, కృష్ణా రూ.48 లక్షలు, గుంటూరు రూ.67 లక్షలు, నెల్లూరు రూ.22 లక్షలు కలిపి మొత్తంగా రూ.6.73 కోట్ల షేర్ వసూలైంది.

 
Like us on Facebook