అమితాబ్ బచ్చన్ సూపర్ హ్యూమన్ అంటూ ఆర్జీవీ కీలక వ్యాఖ్యలు!

Published on Oct 11, 2021 11:07 am IST

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ పుట్టిన రోజు సందర్భంగా వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ సోషల్ మీడియా వేదిక గా కీలక వ్యాఖ్యలు చేశారు. అమితాబ్ బచ్చన్ తో రామ్ గోపాల్ వర్మ పలు సినిమాలని తీసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ మేరకు సర్కారు అమితాబ్ అంటూ సంబోధిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

సర్కారు అమితాబ్ బచ్చన్ మీరు ఎలాగైనా అనేక తరాల హృదయాల్లో శాశ్వతం గా జీవిస్తారు, కానీ శారీరకంగా కూడా మీరు ఎప్పటికీ జీవిస్తారు అని నేను అనుకుంటున్నా అని అన్నారు. మీరు అన్ని విషయాల్లో సాధించారు అని, మీరు సూపర్ హ్యూమన్ అంటూ ఆర్జీవీ చెప్పుకొచ్చారు. ఆర్జీవీ చేసిన వ్యాఖ్యల పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :