“మా ఇష్టం” సినిమా విడుదల వాయిదా…క్లారిటీ ఇచ్చిన ఆర్జీవీ

Published on Apr 7, 2022 5:15 pm IST


థియేటర్ల సమస్యల కారణంగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం లో తెరకెక్కిన మా ఇష్టం చిత్రం వాయిదా పడింది. ఆర్జీవీ తన కెరీర్‌లో వివాదాస్పద చిత్రాలను తీయడం తెలిసిందే. అతని కొత్త చిత్రం మా ఇష్టం, ఒక లెస్బియన్ డ్రామా. ఈ చిత్రం కి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ను సృష్టించింది. ఈ చిత్రం రేపు విడుదల కావాల్సి ఉంది. అయితే దేశంలోని ప్రధాన మల్టీప్లెక్స్ చైన్‌లు సున్నితమైన కంటెంట్ కారణంగా సినిమాను ప్రసారం చేయకుండా నిషేధించడంతో, ఆర్జీవీ సినిమాను వాయిదా వేశారు.

ఈ మేరకు రామ్ గోపాల్ వర్మ ఈ విషయం పై కీలక వ్యాఖ్యలు చేశారు. మా ఇష్టం సినిమా విడుదల విషయం లో లెస్బియన్ సబ్జెక్ట్ మూలాన చాలా ధియేటర్లు కో ఆపరేషన్ లేని దృష్ట్యా సినిమా విడుదల పోస్ట్ పోన్ చేస్తున్నాము. అన్ని విధాలుగా ఈ అన్యాయం ని ఎలా ఎదుర్కోవాలో పరిశీలించి తగు చర్యలు తీసుకున్నా తరువాత మరో విడుదల తేదీ తెలియ చేస్తాను అని అన్నారు. బోల్డ్ సన్నివేశాలతో నిండిన ఈ క్రైమ్ థ్రిల్లర్‌లో అప్సర రాణి మరియు నైనా గంగూలీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

సంబంధిత సమాచారం :