అమెరికన్ లయన్ మైక్ టైసన్ ను కలిసిన ఇండియన్ టైగర్ విజయ్ – ఆర్జీవీ

Published on Nov 16, 2021 1:30 pm IST

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా సినిమా తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా అనన్య పాండే నటిస్తుంది. పూరీ జగన్నాథ్ మరియు ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం లో ప్రముఖ లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవల ఒక ప్రకటన చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ లాస్ ఏంజిల్స్ లో జరుగుతుంది.

ఈ మేరకు చిత్ర యూనిట్ ఇక ఫోటో ను విడుదల చేయడం జరిగింది. విజయ్ దేవరకొండ మరియు మైక్ టైసన్ కలిసి నవ్వులు చిందిస్తున్న ఫోటో అది. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ మేరకు ఈ ఫోటో పై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలి లో స్పందించారు. ఇండియన్ టైగర్ విజయ్ దేవరకొండ అమెరికన్ లయన్ మైక్ టైసన్ ను కలిశారు అంటూ చెప్పుకొచ్చారు. దీన్నే పంచ్ పవర్ అని నేను అంటా అని అన్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీ వచ్చే ఏడాది విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

More