నేను బాధపడ్డాను.. ‘భీమ్లా నాయక్’ ట్రైలర్‌పై ఆర్జీవీ కామెంట్స్..!

Published on Feb 22, 2022 2:35 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్‌గా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘భీమ్లా నాయక్’ చిత్రం ఫిబ్రవరి 25న విడుదల కాబోతుంది. ఈ క్రమంలో కొద్ది గంటల క్రితమే ఈ చిత్ర ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్ర బృందం. అయితే ఈ ట్రైలర్‌పై వివాదాస్పద సినిమాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలీలో రివ్యూ చెప్పుకొచ్చాడు.

నిజాయితీగా చెప్పాలంటే ట్రైలర్ చూసిన తర్వాత భీమ్లానాయక్‌కు బదులుగా డేనియల్ శేఖర్ అని పిలవాలని ఉందని అన్నాడు. ఉత్తరాదిలో బాహుబలి కారణంగా పవన్ కళ్యాణ్ కంటే రానాకు చాలా ప్రజాదరణ ఉందని, ఈ చిత్రంలో అతడు విలన్‌గా కాకుండా హీరోగా మారే అవకాశం ఉందని అన్నాడు. రానా దగ్గుబాటిని ప్రమోట్ చేయడానికి మేకర్స్ పవన్ కళ్యాణ్‌ని వాడుకున్నారని అర్ధమయ్యిందని వర్మ అన్నాడు. అంతేకాదు పవన్ కళ్యాణ్ అభిమానిగా నేను ఈ విషయంలో హర్ట్ అయ్యానని సెటైరికల్‌గా చెప్పుకొచ్చాడు.

సంబంధిత సమాచారం :