ఇది నా లైఫ్ లోనే అతి పెద్ద డౌట్ – ఆర్జీవీ

Published on Dec 27, 2021 10:16 pm IST


కరోనా మూడో వేవ్ ఒమిక్రాన్‌ వైరస్ చాపకింద నీరులా దేశవ్యాప్తంగా విస్తరిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. ఆ చర్యలలో భాగంగా పలు రాష్ట్రాల్లో రాత్రి కర్ఫ్యూలు విధించారు. అలాగే వేడుకల నిర్వహణ, సినిమా థియేటర్లపై కూడా ఆంక్షలు విధిస్తున్నారు. కాగా వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ థియేటర్స్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న అనేక సమస్యల పై తనదైన శైలిలో ఒక ట్వీట్ చేశాడు.

‘‘వివాహాలు, షాపింగ్‌ మాల్స్‌, థియేటర్లు, రెస్టారెంట్లు.. ఇలా ప్రతి చోటా ఎన్నో ఆంక్షలు పెట్టిన ప్రభుత్వం పొలిటికల్‌ ర్యాలీలపై మాత్రం ఎందుకు ఆంక్షలు పెట్టలేదు?’ అంటూ మెసేజ్ పోస్ట్ చేశాడు. అలాగే ఆర్జీవీ మరో మెసేజ్ పోస్ట్ చేస్తూ ‘‘నా లైఫ్ లోనే నాకు అతిపెద్ద డౌట్ ఏమిటంటే.. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకూ కర్ఫ్యూ పెట్టినంత మాత్రాన ఉద్ధృతంగా విస్తరిస్తోన్న వైరస్‌ ఏ విధంగా తగ్గుముఖం పడుతుంది ? ఇది నాకు తెలియడం లేదు ?’’ అంటూ ఆర్జీవీ వెటకారంగా మెసేజ్ చేశాడు.

సంబంధిత సమాచారం :