మహా సముద్రం ట్రైలర్ పై ఆర్జీవీ కామెంట్స్!

Published on Sep 23, 2021 8:00 pm IST


మహ సముద్రం ట్రైలర్ విడుదల అయ్యి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అజయ్ భూపతి దర్శకత్వం లో శర్వానంద్, సిద్ధార్ద్, అదితి రావు హైదరి, అను ఇమ్మన్యూయేల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ను ఏ కే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అజయ్ సుంకర సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్ పై సినీ పరిశ్రమ కి చెందిన పలువురు ప్రముఖులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ మాత్రం తనదైన శైలి లో ట్రైలర్ పై కామెంట్స్ చేశారు. హేయ్ అజయ్ భూపతి మహా సముద్రం ట్రైలర్ RX10,000 లా ఉంది, ఇంకా పచ్చిగా చెప్పాలంటే దాని అమ్మ మొగుడు లా ఉంది అంటూ అడ్వాన్స్ కంగ్రాట్స్ తెలిపారు. రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ సినిమా ను అక్టోబర్ 14 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :