పూరి తీస్తున్న సినిమా ‘పోకిరి’ కన్నా గొప్పగా ఉందట !

22nd, January 2018 - 05:50:41 PM

దర్శకుడు పూరి జగన్నాథ్ అనగానే గుర్తొచ్చేది మహేష్ బాబుతో చేసిన ‘పోకిరి’ సినిమా. అప్పట్లో ఇండస్ట్రీ రికార్డుల్ని బద్దలుకొట్టిన ఈ సినిమా స్థాయి సినిమాను తీయడం పూరి కూడా కష్టమైంది. కానీ పూరి ప్రస్తుతం తన కుమారుడు ఆకాష్ పూరిని హీరోగా పరిచయం చేయడానికి తీస్తున్న ‘మెహబూబా’ మాత్రం ‘పోకిరి’ని మించేలా ఉందని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నారు.

‘మెహబూబా’లోని కొన్ని పార్ట్స్ చూశానని, పూరి తన కుమారుడి సినిమా కాబట్టి చాలా గొప్పగా, స్పెషల్ గా తీశాడని కాంప్లిమెంట్ ఇచ్చారు. దీంతో పొంగిపోయిన పూరి మొదటిసారి నా గురువు నన్ను మొదటిసారి దర్శకుడిగా గుర్తించారు. ఇది నా జీవితంలోనే గొప్ప కాంప్లిమెంట్ అంటూ ఆనందం వ్యక్తం చేశారు. పూరి స్వయంగా నిర్మిస్తున్న ఏ చిత్రంలో ఆకాష్ సరసన నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.