ఏపీలో సినిమా టికెట్ ధరల తగ్గింపు ఇష్యూపై ఆర్జీవీ హాట్ కామెంట్స్..!

Published on Dec 29, 2021 9:44 pm IST

వివాదస్పద సినిమాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి అంశానైనా తనకు తప్పు అనిపిస్తే నిర్మొహమాటంగా తప్పే అని చెప్పేస్తాడు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలను తగ్గించడంపై తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు జగన్ ప్రభుత్వంపై సానుకూలంగానే మాట్లాడిన వర్మ సినిమా టికెట్ల ధరల తగ్గింపు అంశంపై మాత్రం తప్పుపట్టాడు.

ఇటీవల ఒక ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వర్మ మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ ధరలను తగ్గించడం నా దృష్టిలో పూర్తిగా తప్పేనని అన్నారు. టికెట్ ధరను నిర్ణయించే హక్కు ఉత్పత్తి దారులకు ఉంటుందని అయితే దాన్ని కొనాలా? వద్దా? అనేది వినియోగదారుడి ఇష్టమని అన్నారు. సినిమాని చూడాలనుకొనేవారు టికెట్ ఎంత ఉన్నా చూస్తారని, నచ్చనివారు మానేస్తారు, అది వారి ఇష్టమని అన్నారు. సినిమా ఇండస్ట్రీ మీద ఏపీ ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తుందా? లేదా? అనేది మాత్రం నాకు తెలియదని అన్నారు. ఏది ఏమైనా ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ముమ్మాటికీ తప్పేనని వర్మ చెప్పడం ఇప్పుడు హాట్ టాఫిక్‌గా మారింది.

సంబంధిత సమాచారం :