నిజాల్ని చెప్పడం కోసమే ఎన్టీఆర్ బయోపిక్ తీస్తున్నా – ఆర్జీవీ
Published on Oct 8, 2017 4:54 pm IST


యాదార్థ గాథల్ని సినిమాగా తెరకెక్కించడంలో సిద్ధహస్తుడైన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పేరుతో దివంగత మహానటుడు, రాజకీయనాయకుడు అయిన ఎన్టీఆర్ జీవితాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నారు. మరోవైపు బాలకృష్ణ కూడా ఎన్టీఆర్ జీవిత గాథను రూపొందించేందుకు సిద్దమవుతున్న నైపథ్యంలో వర్మ ఈ సినిమా చేస్తుండటం, అది కూడా లక్ష్మీ పార్వతి కోణం నుండి తీస్తుండటం అందరిలోనూ తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.

రాజకీయాలకు అతీతంగా కేవలం నిజాల్ని చెప్పడం కోసమే ఈ సినిమా చేస్తున్నానని, అదే తన ఆంతరంగిక అభిమతమని, ఈ చిత్రాన్ని ప్రధాన ప్రతి పక్షం వై.ఎస్.అర్.సి.పి చెందిన నేత పి. రాకేష్ రెడ్డి నిర్మిస్తున్నారని, ఆయన ఉద్దేశ్యం కూడా పాలిటిక్స్ కావని, నిజాల్ని చెప్పడమేనని వర్మ సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు. మరి ఆరంభంలోనే ఇంతటి సంచలనానికి దారి తీసిన ఈ సినిమా విడుదలయ్యాక ఇంకెన్ని సంచలనాలకి తావిస్తుందోనని సినీ, రాజకీయ వర్గాల్లో ఇప్పటి నుండే చర్చలు మొదలయ్యాయి. ఇకపోతే ప్రాజెక్ట్ ఎప్పుడు రెగ్యులర్ షూట్ కు వెళుతుంది, నటీనటులెవరు, విడుదల ఎప్పుడు అనే వివరాలు త్వరలోనే ప్రకటితం కానున్నాయి.

 
Like us on Facebook