కిచ్చా సుదీప్‌ “విక్రాంత్‌ రోణ” పై ఆర్జీవీ ఇంట్రస్టింగ్ కామెంట్స్

Published on Apr 24, 2022 3:52 pm IST

కేజీఎఫ్ 2 చిత్రం తర్వాత, మరో శాండల్‌వుడ్ మాగ్నమ్ ఓపస్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటించిన విక్రాంత్ రోణ. ఈ చిత్రం పై వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం జరిగింది.

సోషల్ మీడియా ద్వారా ఈ చిత్రం పై ప్రశంసల వర్షం కురిపించారు. అతను 3డీ లో చిత్రం యొక్క కొన్ని ఫుటేజీలను చూశాననీ, ఆ సన్నివేశాలు చాలా ఆకట్టుకున్నాయి అని తెలిపారు. ఇది చాలా అద్భుతంగా ఉందని, తదుపరి స్థాయి సినిమా కోసం తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని పేర్కొన్నాడు. అనూప్ భండారి దర్శకత్వం వహించిన ఈ బిగ్గీలో నిరూప్ భండారి, నీతా అశోక్ మరియు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ప్రధాన పాత్రలు పోషించారు. షాలిని ఆర్ట్స్ నిర్మించిన ఈ చిత్రం కన్నడ, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ మరియు ఇంగ్లీషు భాషల్లో కూడా జూలై 28, 2022న థియేటర్లలో విడుదలవుతోంది. ఈ చిత్రానికి అంజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :