నాని “జెర్సీ” రీమేక్ పై ఆర్జీవీ కీలక వ్యాఖ్యలు

Published on Apr 26, 2022 3:03 pm IST


నేచురల్ స్టార్ నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం లో వచ్చిన చిత్రం జెర్సీ. స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కిన ఈ చిత్రం టాలీవుడ్ లో సూపర్ హిట్ సాధించిన సంగతి అందరికీ తెలిసిందే. హీరో నాని నటనకు ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా, విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఈ చిత్రం. ఇదే చిత్రాన్నే బాలీవుడ్ లో షాహిద్ కపూర్ హీరోగా రీమేక్ చేయడం జరిగింది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేదు.

ఈ మేరకు ఈ రీమేక్ పై వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందిస్తూ, కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. నాని జెర్సీ చిత్రాన్ని డబ్ చేసి హిందీలో విడుదల చేసి ఉంటే 10 లక్షల రూపాయలు ఖర్చు అయ్యి ఉండేది అని, అదే సినిమా ను 100 కోట్ల రూపాయల తో రీమేక్ చేయడం ద్వారా ఫలితం గా డబ్బు, సమయం, శ్రమ వృధా అన్నట్లు చెప్పుకొచ్చారు. అంతేకాక డెత్ ఆఫ్ రీమేక్స్ అంటూ చెప్పుకొచ్చారు వర్మ. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

సంబంధిత సమాచారం :