ఫిల్మ్ చాంబర్ పై విరుచుకుపడ్డ రామ్ గోపాల్ వర్మ !


డ్రగ్స్ స్కాండల్ అంశం తెలుగు సినీ పరిశ్రమను ఎంతలా కుదిపేసిందో అందరికీ తెలిసిందే. ఆరోపణలు ఎదుర్కొని, నోటీసులు అందుకున్న ప్రతి ఒకర్ని ప్రత్యేక బృందం నిశితంగా విచారిస్తోంది. ఈ నైపథ్యంలో కొన్ని రోజుల క్రితం తెలుగు ఫిల్మ్ చాంబర్ ముఖ్యమంత్రికి ఒక బహిరంగ లేఖ రాసింది. అందులో కొందరు చేసిన తప్పులకు మొత్తం పరిశ్రమను నిందించడం భావ్యం కాదు వంటి వాక్యాలను వాడింది. ఆ లేఖ మొత్తం సారాంశం చూసినా కొంత మంది వ్యక్తులు తప్పుచేశారనే నిర్ణయానికి వచ్చేసినట్టే ఉంది.

ఇప్పుడు ఈ అంశాన్నే దర్శకుడు వర్మ సోషల్ మీడియా ద్వారా ఖండిస్తూ చాంబర్ పై విమర్శలు, ప్రశ్నలు సంధించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఇంకా విచారణలోనే ఉన్నారు. వారిపై నేరం ఇంకా రుజుబువుకాలేదు. కనీసం చార్జెస్ కూడా ఫైల్ కాలేదు. అలాంటిది ఫిల్మ్ ఛాంబర్ మాత్రం వాళ్ళు తప్పు చేశారనే నిర్థారణకు వచ్చి, ప్రభుత్వానికి ప్రాధేయపడి క్షమాపణలు చెప్పారు. దీని వలన నేరం రుజువు కాకుండానే వాళ్ళు తప్పు చేసిన వాళ్ళైపోయారు.

కాబట్టి ఆరోపణలు ఎదుర్కుంటున్న వారు కూడా ఎవరికీ భయపడకుండా బహిరంగ లేఖలు రాయాలి. అది మీ హక్కు. ఒకవేళ రేపు వీళ్లంతా తప్పు చేయలేదని రుజువైతే చాంబర్ వీళ్ళకు బహిరంగ లేఖ ద్వారా క్షమాపణలు చెప్పాలి. లేకుంటే చాంబర్ ప్రాధేయపడటం వలనే ప్రభుత్వం వాళ్ళను వదిలేసిందనే అబద్దం నిజంగా మిగిలిపోతుంది. ఆ అబద్దం నిజం కాకుండా చూడాల్సిన భాద్యత చాంబర్ కు ఉందని గౌరవపూర్వకంగా తెలుయజేస్తున్నాను అన్నారు. మరి అర్థమున్న వర్మ వ్యాఖ్యలపై చాంబర్ ఎలా స్పందిస్తుందో చూడాలి.