‘సదా నన్ను నడిపే’ మూవీని మెచ్చుకున్న ఆర్జీవీ

Published on Jun 28, 2022 12:00 am IST

యువ నటుడు ప్రతీక్ ప్రేమ్ నటించిన లేటెస్ట్ మూవీ సదా నన్ను నడిపే. ఇటీవల వానవిల్లు మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రతీక్, ఆ మూవీతో మంచి పేరు అందుకున్నారు. ఇక లేటెస్ట్ గా వచ్చిన సదా నన్ను నడిపే మూవీలో హీరోగా నటిస్తూ స్వయంగా తానే స్క్రీన్ ప్లే, సంగీతం అందించడంతో పాటు, దర్శకుడిగా కూడా వ్యవహరించారు. వైష్ణవి హీరోయిన్ గా నటించిన ఈ మూవీ లో నాజర్, రాజీవ్ కనకాల, నాగేంద్ర బాబు, ఆలీ తదితరులు ఇతర పాత్రలు చేసారు. ఈ మూవీ ట్రైలర్ ఆసక్తికరంగా ఉందని, ఇక ఈ నెల 24న విడుదలైన సినిమాని చూసిన తనకు ఎంతో బాగా నచ్చిందని సంచలన దర్శకడు రామ్ గోపాల్ వర్మ, మూవీ ట్రైలర్ ని తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేసి యూనిట్ కి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

ముఖ్యంగా హీరో ప్రతీక్ ప్రతి ఫ్రేమ్ లో ఎంతో బాగా నటించారని, సినిమాలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న హీరోయిన్ ని బ్రతికించుకోవడం కోసం హీరో ఎటువంటి త్యాగం చేసాడు అనే కథాంశం తనకు నచ్చిందని వర్మ అన్నారు. ఇక వర్మ అంతటి డైరెక్టర్ తమ మూవీని మెచ్చుకోవడంతో ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు హీరో ప్రతీక్. ఇప్పటివరకు తమ మూవీ రూ. 1 కోటి 80 లక్షల కలెక్షన్ ని దక్కించుకుని ప్రస్తుతం చాలా ఏరియాల్లో స్టడీగా కొనసాగుతూ మంచి కలెక్షన్స్ రాబడుతోందని హీరో, దర్శకుడు ప్రతీక్ చెప్తున్నారు.

సంబంధిత సమాచారం :