క్యాసినో పై ముందు ఎన్టీఆర్‌ ను ప్రశ్నించాలి -వర్మ

Published on Jan 24, 2022 7:18 am IST

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మొత్తానికి తన వివాదాస్పద ట్వీట్స్ ను అలాగే కంటిన్యూ చేస్తున్నాడు. తాజాగా గుడివాడ క్యాసినో పై టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణల పై రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందిస్తూ… ఒక ట్వీట్ పెట్టాడు. ఇంతకీ అర్జీవి పెట్టిన ట్వీట్ ఏమిటంటే.. ‘కొడాలి నాని కంటే ముందు గుడివాడ క్యాసినో లైఫ్ గురించి నేను గ్రేట్ జయ మాలిని ద్వారా విన్నాను. ఇక సీనియర్ ఎన్టీఆర్ గారు కూడా తన సినిమాలో ఆ పాటను అనుమతించారు. అందుకే, క్యాసినోపై కొడాలి నానిని ప్రశ్నించే ముందు టీడీపీ నేతలు ఎన్టీఆర్‌ను ప్రశ్నించాలి’ అంటూ ఒక పోస్ట్ పెట్టాడు.

పైగా ట్వీట్ తో పాటు.. యమగోల సినిమాలోని ‘గుడివాడ వెళ్లాను’ అనే వీడియో సాంగ్‌ ను కూడా అర్జీవి పోస్ట్ చేయడం విశేషం. ఇప్పటికే అర్జీవి సినిమా టికెట్ రేట్ల విషయంలో తల దూర్చి ఏపీ మంత్రి పేర్ని నానితో కూడా చర్చించిన సంగతి తెలిసిందే. అయితే, అర్జీవి చర్చ కారణంగా ఆ సమస్యకి ఎలాంటి పరిష్కారం మాత్రం దొరకలేదు. ఏది ఏమైనా ఈ మధ్య వర్మ ట్వీట్స్ పట్ల ఆయన అభిమానులతో పాటు తెలుగు హిందీ సినీ పరిశ్రమల్లో కూడా ఆసక్తి పెరుగుతుంది.

సంబంధిత సమాచారం :