‘సర్కార్ 3’ ప్రీమియర్ డేట్ రివీల్ చేసిన వర్మ !
Published on Apr 28, 2017 12:10 pm IST


సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన బాలీవుడ్ చిత్రం ‘సర్కార్ 3’. గతంలో రూపొందిన ‘సర్కార్, సర్కార్ రాజ్’ చిత్రాలు సాధించడం, అమితాబ్ బచ్చన్ మళ్ళీ ప్రధాన పాత్ర పోషిస్తుండంతో ఈ చిత్రం పై భారీ అంచనాలున్నాయి. ముందుగా ఈ చిత్రాన్ని తన పుట్టినరోజైన ఏప్రిల్ 7న రిలీజ్ చేస్తారని వర్మ ప్రకటించాడు. కానీ అనుకున్న సమయానికి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తికాకపోవడం, కొన్ని సన్నివేశాలని రీ షూట్ చేయాల్సి రావడంతో విడుదల ఆలస్యమైంది.

ఇకపోతే ఈ చిత్రాన్ని మే 12 సిడ్నీలో జరగనున్న ‘ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ అండ్ అవార్డ్స్ ఆఫ్ ఆస్ట్రేలియా’ వేడుకలో ప్రీమియర్ రూపంలో ప్రదర్శించనున్నట్టు కొద్దిసేపటి క్రితమే వర్మ తెలియజేశారు. ఈ ప్రీమియర్ షోకి చిత్రంలో నటించిన యామి గౌతమ్, అమిత్ షాహ్, దర్శకుడు వర్మ, నిర్మాత రాహుల్ మిత్ర హాజరుకానున్నారు. అయితే సినిమాను థియేటర్లలో ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే విషయంపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు.

 
Like us on Facebook