విజయ్ దేవరకొండ మరో మెగాస్టార్ అవుతాడట !


యంగ్ హీరో విజయ్ దేవరకొండ చిత్రం ‘అర్జున్ రెడ్డి’ ఈరోజే థియేటర్లలోకి వచ్చింది. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో పాటు విజయ్ కు కూడా ప్రసంశలు దక్కుతున్నాయి. విజయ్ అర్జున్ రెడ్డి పాత్రలో నటించాలేదని జీవించాడని ప్రేక్షకులు, విమర్శకులు అభిప్రాయపడుతుంటే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం అతన్ని మెగాస్టార్ తో పోల్చారు. ఈ కాలం నటుల్లో చాలా మందికి హీరోగా కనిపించడానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్, స్లో మోషన్ షాట్స్ అవసరామని కానీ విజయ్ కీ అలాంటివి ఏమీ అక్కర్లేదని అన్నారు వర్మ.

అలాగే తానూ చూసిన నటులలో అమితాబ్ బచ్చన్ తర్వాత అంతటి ఇంటెన్సిటీ ఉన్న నటుడు విజయేనని, యంగ్ అమితాబ్ ను, యంగ్ ఆల్ ప్యాచినోను కలిపితే విజయ్ అవుతాడని, అతను టాలీవుడు అమితాబ్ అని, తెలంగాణ రాష్ట్రం యొక్క మొదటి మెగాస్టార్ అని అన్నారు. అంతేగాక చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగను కూడా ఆర్జీవీ పొగడ్తలతో ముంచెత్తారు.