తెలుగు, కన్నడ సినిమాలు బాలీవుడ్లో కోవిడ్ వైరస్ గా సోకాయి.!

Published on Apr 26, 2022 5:10 pm IST

ప్రస్తుతం మన సౌత్ ఇండియా సినిమా నుంచి తెలుగు సహా కన్నడ చిత్రాలు ఏ రేంజ్ లో ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతున్నాయో తెలిసిందే. ముఖ్యంగా చెప్పాలంటే హిందీ బాక్సాఫీస్ దగ్గర ఈ రెండు భాషల సినిమాలు హవా కొనసాగిస్తున్నాయి. ఐకాన్ స్టార్ “పుష్ప 1” నుంచి లేటెస్ట్ గా “రౌద్రం రణం రుధిరం” అలాగే “కేజీయఫ్ చాప్టర్ 2” వరకు సాలిడ్ రన్ ని అందుకొని హిందీ సినిమాలకే షాకిచ్చాయి.

దీనితో సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ బాలీవుడ్ లో తెలుగు మరియు కన్నడ సినిమాల హవా పై సంచలన పోస్టులు పెట్టడం వైరల్ గా మారుతుంది. ఇప్పుడు బాలీవుడ్ లో తెలుగు మరియు కన్నడ సినిమాలు కోవిడ్ వైరల్ లా సోకి పోయయయని అంటే అక్కడ ఇండస్ట్రీలో ప్రేక్షకులు హిందీ సినిమాలని వదిలేసి మన తెలుగు డబ్బింగ్ సినిమాలను చూడడం ఆపుకోలేకపోతున్నారని దీనికి వాక్సిన్ ని బాలీవుడ్ కనుక్కుంటుందని అనుకుంటున్నానని వర్మ తనదైన శైలి ట్వీట్లు చెయ్యడం ఇప్పుడు ఆసక్తిగా మారింది.

సంబంధిత సమాచారం :