చంద్రబాబు పాత్రలో స్నేహితుడ్ని ప్రవేశపెట్టనున్న వర్మ ?
Published on Oct 24, 2017 8:35 am IST


సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పేరుతో రామారావుగారి జీవితాన్ని తెరకెక్కించే పనిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ బయోపిక్ ను లక్ష్మీ పార్వతి కోణంలోంచి తీస్తానని ఆరంభంలోనే బాంబు పేల్చిన వర్మ ముఖ్య పాత్రల కోసం నటీనటుల్ని ఎంచుకునే పనిలో ఉన్నారు. ముఖ్యంగా ప్రశ్న పాత్రలైన ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతి, చంద్రబాబు నాయుడు పాత్రల్లో కనుపించబోయే నటీనటులపైనే అందరికీ ఆసక్తి ఎక్కువగా ఉంది.

సినీ వర్గాల నుండి వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం చంద్రబాబు నాయుడుగారి పాత్ర కోసం వర్మ తన సన్నిహిత మిత్రుడు, నటుడు జెడి. చక్రవర్తిని అనుకుంటున్నారని సమాచారం. లుక్స్ దగ్గర్నుంచి, బాడీ లాంగ్వేజ్ వరకు జేడీ అయితే బాబు పాత్రకు సరిపోతాడని వర్మ ఈ ఆలోచన చేశారట. మరి ఎప్పటికప్పుడు పిడుగులాంటి నిర్ణయాలను తీసుకునే వర్మ జేడీనే తీసుకుంటారో లేకపోతే వేరొకర్ని వెతుకుతారో చూడాలి. ఇకపోతే ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతిల పాత్రల్లో కొత్త నటీనటుల్ని తీసుకుంటారని కూడా తెలుస్తోంది.

 
Like us on Facebook