ఇంతకీ వర్మ ఇచ్చే షాక్ ఏంటో ?


రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’తో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగానే హడావుడి చేస్తున్నాడు. ఇప్పటికే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ నుండి రెండు పాటల్ని విడుదల చేసి బాగానే వార్తల్లో నిలిచాడు. పైగా వెన్నుపోటు సాంగ్ లో వర్మ నేరుగా చంద్రబాబు నాయుడిని కించపరుస్తూ లిరిక్స్ పెట్టి.. తెలుగు తమ్ముళ్ళలో ఆగ్రహాఆవేశాలను కూడా రేపాడు.

అయినా వర్మ మాత్రం ఇప్పట్లో బాబును, తెలుగు తమ్ముళ్ళను వదిలేలా లేడు. ఈ రోజు ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా ఇంకో షాక్ ఇవ్వబోతున్నా అని నిన్న ట్వీట్ చేసిన వర్మ ఇంతకీ ఆ ట్విస్ట్ ఏంటో మాత్రం వెల్లడించలేదు. ఎన్టీఆర్ ఈ లోకాన్ని విడిచిన రోజే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ప్రాణం పోసుకుంటుందన్నాడు.

అసలు వర్మ ఏ ఉద్దేశ్యంతో ఆ ట్వీట్ ట్వీట్టాడో గాని.. ప్రస్తుతం టిడిపి అభిమానులు మరియు సానుభూతిపరులు వర్మ ఏమైనా తమకు అభ్యంతరకరమైన షాక్ ఇస్తే.. వర్మని దీటుగా ఎదురుకోవడానికి రెడీగా ఉన్నారట. అయితే వర్మ మాత్రం ఈ సినిమాలో అన్ని నిజాలే చెబుతున్నా అని అంటున్నాడు.

Exit mobile version