
భీమవరం టాకీస్ పతాకంపై విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తున్న ‘ఐస్ క్రీమ్ 2’ అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని విడుదలకి సిద్దమైంది. తుమ్మలపల్లి రామ సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాలో జెడి చక్రవర్తి, నవీన, నందు, జీవా, ధనరాజ్, సిద్దు, భూపాల్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ముందుగా ఈ సినిమాని నవంబర్ 7న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేసారు. కానీ ఈ వారం మొత్తం 3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అన్ని సినిమాల నడుమ రిలీజ్ ఎందుకు అనే ఉద్దేశంతో ఈ చిత్ర టీం రిలీజ్ ని వాయిదా వేసారు. అలాగే నవంబర్ 21న రిలీజ్ చెయ్యడానికి ఈ చిత్ర టీం సన్నాహాలు చేసుకుంటోంది. చాలా లో బడ్జెట్ తో తీసిన ఈ సినిమా వీకెండ్ ఆడితే చాలు నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్స్ కి లాభం వచ్చేస్తుందని రామ్ గోపాల్ వర్మ చెబుతున్నాడు. గతంలో ఐస్ క్రీమ్ కి కూడా ఒకరోజు ఆడితే చలాని అన్నారు. ఇది కాకుండా ఐస్ క్రీమ్ 3, ఐస్ క్రీమ్ 4 సినిమాలు కూడా షూటింగ్ పూర్తి చేసుకునే పనిలో ఉన్నాయి.