ఇద్దరమ్మాయిల ప్రేమకథతో తెరకెక్కిన్న ఆర్జీవీ “మా ఇష్టం” రిలీజ్ డేట్ ఫిక్స్!

ఇద్దరమ్మాయిల ప్రేమకథతో తెరకెక్కిన్న ఆర్జీవీ “మా ఇష్టం” రిలీజ్ డేట్ ఫిక్స్!

Published on May 5, 2022 12:07 AM IST


డిఫరెంట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా, నేటితరం ప్రేక్షకులను అలరిస్తున్న డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. జానర్ ఏదైనప్పటికీ తాను ఏదైతే చెప్పాలని అనుకుంటున్నారో దానికి తెర రూపమిస్తూ, విలక్షణ దర్శకుడిగా వెండితెరపై తన మార్క్ చూపిస్తున్నారు. దేశంలోనే తొలిసారి మా ఇష్టం సినిమా పేరుతో ఓ లెస్బియన్ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు వర్మ. ఇద్దరమ్మాయిల ప్రేమకథతో తెరకెక్కిన్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు వీడియోలు సినిమాపై అంచనాలు పెంచేశాయి.

ఈ మా ఇష్టం (డేంజరస్) అనే చిత్రాన్ని మే 6వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఆస్క్ ఎనీథింగ్ అనే కార్యక్రమం చేపట్టారు ఆర్జీవీ. హైదరాబాద్ అంబేద్కర్ యూనివర్సిటీలో జరిగిన ఈ కార్యక్రమంలో డైరెక్టర్ వర్మతో పాటు చిత్రంలో లీడ్ రోల్స్ పోషించిన నైనా గంగూలీ, అప్సర రాణి పాలొన్నారు. లెస్బియన్ శృంగారం విషయమై పలువురు స్టూడెంట్స్, రాముయిజం ఫాలోవర్స్ అడిగిన ఘాటైన ప్రశ్నలకు వర్మ ఓపెన్ గా సమాధానాలు చెప్పి ఆకట్టుకున్నారు. ఈ సినిమా ఓ డిఫరెంట్ అనుభూతి కలిగిస్తుందని, గతంలో ఎన్నడూ చూడనివిధంగా ఉంటుందని అన్నారు.

ఇద్దరు మహిళల మధ్య సాగే ఘాటు ప్రేమ కథ ఇది. స్త్రీ, పురుషుని మధ్య ప్రేమ, లైంగిక వాంఛ ఎలా అయితే ఉంటాయో వీరి మధ్య కూడా అలాగే ఉంటాయి. ఎందుకంటే ప్రేమ అనేది ప్రేమ మాత్రమే. దానికి లింగబేధంతో ఎలాంటి సంబంధం లేదు అని పేర్కొంటూ వదిలిన మా ఇష్టం ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేసింది. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గా తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా మే 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు