రాధే శ్యామ్ మూవీ, ప్రభాస్ పై రిద్ధి కుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Published on Mar 4, 2022 8:00 pm IST


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం రాధే శ్యామ్. ఈ చిత్రం ను యూ వి క్రియేషన్స్ పతాకంపై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ను మార్చ్ 11 వ తేదీన భారీగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ మేరకు ఈ చిత్రం లో నటించిన రిద్దీ కుమార్ మీడియా తో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

చిన్నప్పటి నుండి మూవీస్ పై మక్కువ తో సినీ పరిశ్రమ లోకి అడుగు పెట్టిన రిద్ది కుమార్, రాధే శ్యామ్ చిత్రం లో కీలక పాత్ర లో నటిస్తున్నారు. ఈ మేరకు సినిమా కి సంబందించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

రాధే శ్యామ్ చిత్రం లో నాది ట్రిగ్గర్ పాయింట్. ఈ సినిమా లో నా పాత్ర ఇంక్రెడిబుల్ గా ఉంటుంది. ఈ పాత్ర గురించి ఎక్కువగా చెప్పలేను, మార్చ్ 11 న అందరూ చూస్తారు. ప్రతి మహిళ గర్వపడే విధంగా ఉంటుంది. స్పోర్ట్స్ పర్సన్ గా నటించడం జరిగింది. ఆర్చరీ నేర్చుకున్నా, రన్నింగ్, ఇంకా చాలా నేర్చుకున్నా. ప్రభాస్ తో పని చేయడం చాలా అదృష్టం గా భావిస్తున్నా, అందరూ డార్లింగ్ అని ఎందుకు పిలుస్తారు అనేది సెట్స్ లో వర్క్ చేశాక అర్దం అయ్యింది.

సెట్స్ లో చాలా కూల్ గా ఉండేవారు, ఎంకరేజ్ చేసేవారు ప్రభాస్. పూజా హెగ్డే తో ఒక్క షాట్ మాత్రమే చేయడం జరిగింది. ప్రభాస్ తో ఎక్కువ సీన్లు చేశాను. ఇది ప్రభాస్ యుగం అని కచ్చితంగా చెప్పవచ్చు. ప్రభాస్ తో ఎక్కువగా సెట్స్ లో మూవీ గురించి, ఫుడ్ గురించి ఎక్కువగా డిస్కస్ చేసే వాళ్ళం. డైరెక్టర్ రాధా కృష్ణ కుమార్ జీనియస్. రియలిస్టిక్ గా చూపించడం కోసం చాలా కష్టపడ్డారు. ప్రభాస్ తో నటిస్తున్న అని తెలిసినప్పుడు అమ్మ చాలా సంతోషించారు. నా పాత్ర పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ గా ఉంటుంది, బబ్లీ గా కాకుండా.

సంబంధిత సమాచారం :